కాజీపేటలో కేటీఆర్‌కు ఘన స్వాగతం..
కాజీపేట, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆదివారం కర్రేపల్లి పంప్‌హౌస్‌కు బయలుదేరిన సందర్భంగా కాజీపేటలో పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. 47వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ కనుకరాజు ఆధ్వర్యంలో కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా దువ్వ కనుకరాజు మాట్లాడుతూ, కేటీఆర్ నాయకత్వం ప్రజల్లో ఆశను నింపుతోందని అన్నారు. ఆయన చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రజల పట్ల నిబద్ధత, సేవాభావం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో దువ్వ నరేష్, కిట్టు, అఫ్జల్ బాయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
