తొర్రూరు పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

  • తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణ ప్రజలకు మరింత మెరుగైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో యతిరాజా రావు పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఉన్న పార్కును సందర్శించి అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా అత్యవసర నిధులను కేటాయించడమే కాకుండా,ఆ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.పార్కును ఆధునిక సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్కు అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్,7,10వ వార్డు కౌన్సిలర్లు మాడుగుల భవానీ లత, ముద్దసాని సురేష్, వాకింగ్ అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.