Theft Hyd | ముఠా అరెస్ట్… రూ.29లక్షల సొత్తు స్వాధీనం
Theft Hyd | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యుల ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసును సీసీటీవీ ఫుటేజీ, ఫింగర్‌ప్రింట్ల ఆధారంగా పోలీసులు ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యుల ఇల్లు తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన నిందితులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బంగారు ఆభరణాలు, నగదును అపహరించి పరారయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 134 గ్రాముల బంగారం, రూ.12.50 లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.29 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా, కోర్టు రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
