వైభవంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన వేడుకలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పురోహితులు హరి సర్వోత్తమాచారి, సందీప్ చారి ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం, గణపతి పూజ, ఋత్విక్ వరణం, స్వస్తి పుణ్యాహవాచనం, వాస్తు మండప పూజ, నవగ్రహ పూజ, జలాధివాసం, యంత్ర పూజ, ధాన్యాధివాసం తదితర క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం మండప దేవతా పూజ, శయ్యాధివాసం, పూర్ణాహుతి అనంతరం ఉదయం 9.30 గంటలకు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన, యంత్ర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాతపేటతో పాటు కుర్వ వీధులకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకలకు తరలివస్తుండటంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.
బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.
