04:00 P.M | 4 జూలై 2026 ముఖ్యాంశాలు

వింబుల్డన్‌లో జొకోవిచ్ చరిత్ర..

వింబుల్డన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చరిత్రలో నిలిచే ఘనతను అందుకున్నాడు. టోర్నీలో 105వ మ్యాచ్‌ను గెలిచి పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ ఫెడరర్ రికార్డును సమం చేశాడు. Click here to read the full story.

కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల సందడి..

విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. 2026 జూలై 3న నమోదైన గణాంకాల ప్రకారం ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం పొందారు. Click here to read the full story.

వైభవంగా స్వర్ణగిరి వేంకటేశ్వరుని నిత్య కళ్యాణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించారు. Click here to read the full story.

ట్రిపుల్‌ ఐటీలో కలకలం

 హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థి అనిరుధ్ క్యాంపస్‌లోని భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. Click here to read the full story.

అత్యాధునిక వైద్య సేవలకు సీఎం చంద్రబాబు శ్రీకారం

స్వర్ణ కుప్పం దార్శనిక ప్రణాళిక–2029లో భాగంగా కుప్పం ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.1.70 కోట్ల వ్యయంతో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) సామాజిక బాధ్యత నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఆధారిత శరీర చిత్రీకరణ (సీటీ స్కాన్) కేంద్రాన్ని, అపోలో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూత్రపిండ శుద్ధి (డయాలసిస్) కేంద్రాన్ని ప్రారంభించారు. Click here to read the full story.

‘రెడ్ అలర్ట్’ జారీ చేసిన ఐఎండీ

దేశ ఆర్థిక రాజధాని ముంబైపై మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శని, ఆదివారాల్లో నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఇప్పటికే పలురోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో జనజీవనం తీవ్రంగా దెబ్బతినగా, రాబోయే రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Click here to read the full story.