ఎల్కతుర్తిలో మంత్రి పొన్నం పర్యటన ..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కూడా నిధులతో మంజూరైన ఎల్కతుర్తి–మడిపల్లి రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
