సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర..
- హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు
- మజ్లిస్తో కుమ్మక్కయిన కాంగ్రెస్
- కష్టపడి పని చేసే వారికే గౌరవం ఉంటుంది..
- ఆరు గ్యారెంటీలను అమలు చేయండి..
- కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
మేడిపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం “సర్” ను ఉపయోగించుకుని హిందువల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. కాచారంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. 10లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మన్నపేట గ్రామంలో 8 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
దేశాయ్ పేట్ లో 9 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన బస్టాండ్ ను ప్రారంభించారు. మరో 36 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. మన్నెగూడెంలో 10 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కథలాపూర్ మండలం గంభీర్ పూర్లో 4 లక్షల 50 వేల వ్యయంతో సీసీ డ్రెయిన్, పోసానిపేటలో 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, దూంపేటలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా బీమారం మండలం దేశాయ్ పేట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సహకరించడం లేదన్నారు. ఫలితంగా అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదన్నారు.
హిందువులంతా జాగృతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మజ్లిస్తో కుమ్మక్కై కాంగ్రెస్ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఏ ప్రాంతం బాగుపడాలన్నా ముందు రవాణా సౌకర్యాలు బాగుంటేనే సాధ్యమవుతుందని, అందుకే నేను ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు అత్యధిక ప్రాధాన్యత రోడ్ల నిర్మాణానికే ఇచ్చానన్నారు. మోదీ ఆశీస్సులు, నితిన్ గడ్కరీ సహకారంతో గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి సడక్ యోజన, సీఆర్ఎ ఫ్ నిధులతోపాటు జాతీయ రహదారుల విస్తరణ కోసమే ఎక్కువ నిధులు తీసుకొచ్చినట్లుత ఎలిపారు. రోడ్ల కోసమే రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని, గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 22 వేల కోట్లకుపైగా కేంద్ర నిధులు తీసుకొస్తే, అందులో రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.
వేమలవాడ నియోజకవర్గంలోనే ఇటీవల మల్యాల నుండి కాచారం వరకు, సిరికొండ నుండి వేములవాడ వరకు 20 కోట్లతో, మేడపల్లి నుండి గోవిందారం వరకు రూ.25 కొ ట్లతో, సిరికొండ నుండి వేములవాడ వరకు రూ.23 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. కేవలం జాతీయ రహదారుల విస్తరణ కోసమే 5 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంపీగా పనిచేసిన ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవన్నారు. 2 వేల 147 కొ ట్లు నిధులతో కరీంనగర్- వరంగల్ నేషనల్ హైవే పనులను పూర్తి చేసుకుని దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు.
అలాగే 578 కోట్ల రూపాయలతో ఎల్కతుర్తి- సిద్దిపేట నేషనల్ హైవే పనులు శరవేగంగా పూర్తవుతున్నాయన్నారు. ఈ ప్రాంత చిరకాల వాంఛ అయిన కరీంనగర్, జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభించుకొ బోతున్నామని, 2 వేల 3 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయన్నారు. గతంలో తెలంగాణ మొత్తానికి 800 కోట్ల సీఐఆర్ఎఫ్ నిధులు మంజూరైతే.. అందులో ఒక్క కరీంనగర్ పార్లమెంటే 291 కోట్లు తీసుకొచ్చి 1341 కిలోమీటర్ల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లను నిర్మించిన ఘనత మాదేనన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకం కింద వందలాది కోట్లు ఖర్చు చేసి రోడ్లు నిర్మించామన్నారు.
