పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సేవా సమస్యల పరిష్కారమే పీఆర్టీయూటీఎస్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కృషితో ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో సంఘం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు నాణ్యమైన హెల్త్ కార్డు సేవలు అందేలా చర్యలు తీసుకోవడం, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని అమలు చేయించడం, సేవలో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ స్పెషల్ టెట్ నిర్వహించడం, అందరికీ సమాన న్యాయం జరిగేలా ఏకీకృత సేవా నియమావళి (యూనిఫైడ్ సర్వీస్ రూల్స్) అమలు చేయాలని పీఆర్టీయూటీఎస్ నిరంతరం పోరాడుతోందని వివరించారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో సంఘానికి మరింత బలం చేకూరాలంటే ప్రతి ఉపాధ్యాయుడు పీఆర్టీయూటీఎస్ సభ్యత్వం తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్, మండల అధ్యక్షురాలు రహమత్ బీ, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.