వెయిట్ లిఫ్టింగ్‌లో కడెం యువకుడి ప్రతిభ..
కడెం, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫిట్‌నెస్ హబ్‌లో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముఖిమ్ పాల్గొని 70 కేజీల వెయిట్ లిఫ్టింగ్, 120 కేజీల డెడ్ లిఫ్ట్ విభాగాల్లో ప్రతిభ కనబరిచాడు.
వెయిట్ లిఫ్టింగ్, డెడ్ లిఫ్ట్ విభాగాల్లో ప్రత్యేక ప్రతిభ చూపిన మహమ్మద్ అబ్దుల్ ముఖిమ్‌కు నిర్వాహకులు సద్దాం ఓవరాల్ ఛాంపియన్ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి సర్టిఫికెట్ పొందిన అబ్దుల్ ముఖిమ్‌ను కడెం ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు అభినందించారు.
