TRS | కవితకు ఈసీ షాక్

TRS | కవితకు ఈసీ షాక్

TRS | హైదరాబాద్, ఆంధ్రప్రభ : కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్) పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీ పేరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొంటూ పేరు మార్చాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ ఆదేశాల ప్రకారం, ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై అభ్యంతరాలు నమోదయ్యాయని, అందువల్ల 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సమర్పించాలని సూచించింది. నిర్దేశిత గడువులో పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

అలాగే ‘టీఆర్‌ఎస్’ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేస్తూ ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై కవిత న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.