వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్మల్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్మల్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం..

నిర్మల్‌ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, పాల్గొన్నారు.*

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, ఐపీఎస్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్..

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు శాఖల పనితీరును డీజీపీ సమగ్రంగా సమీక్షించి, సంబంధిత జిల్లా పోలీసు అధికారులతో జిల్లాల వారీగా శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నివారణ, కోర్టు లియాజనింగ్, పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలు, క్రైమ్ మీటింగ్‌ల నిర్వహణ, నార్కోటిక్ డ్రైవ్‌లు, Arrive Alive కార్యక్రమం, రోడ్డు భద్రత చర్యలు, పోలీస్ స్టేషన్లలో 5S విధానం అమలు, CCTNS 2.0 వినియోగాన్ని మరింత సమర్థవంతంగా పెంచడం, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం, జిల్లాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు మరియు వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించడం వంటి అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

అలాగే ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టపరంగా సత్వర చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల.తో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, ఏ.ఓ. యూనుస్ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, గోవర్ధన్ రెడ్డి, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.