టిఫిన్ తృప్తిగా ఉంది
టిఫిన్ తృప్తిగా ఉంది
- మెప్మా క్యాంటీన్ కు మంత్రి కితాబు
- ఏలూరులో మంత్రి నారాయణ
ఆంధ్ర ప్రభ, ఏలూరు బ్యూరో.

ఏలూరులోని మెస్మా మహిళల ఆధ్వర్యంలోని క్యాంటీన్ లో పురపాలక శాఖ మంత్రి నారాయణ అల్పాహారం రుచి చూసి.. సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏలూరులో పర్యటిస్తున్న మంత్రి నారాయణ తృప్తి క్యాంటీన్ ను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్బన్ ప్రాంతాలలో 28 లక్షల మంది మహిళలు ఉన్నారని, మెప్మా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటిన్ లతో ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహణ జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో తృప్తి క్యాంటిన్లు ఉన్నాయని ,మరో ఎనిమిది తృప్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వాటిలో భాగంగానే ఏలూరులో మరో తృప్తి క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మంత్రి నారాయణ వెంట ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహన్ పెదబాబు, కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, మున్షిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఉన్నారు.

