Suicide Attack | 30 మంది మృతి…

Suicide Attack | 30 మంది మృతి…

Suicide Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బలూచిస్థాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లా పరిధిలోని జీవానీలో ఉన్న పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనకు తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఎ) ప్రకటించింది. దాడిలో 30 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు బీఎల్ఎ పేర్కొంది. అయితే అధికారికంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఈ వివరాలను ధృవీకరించాల్సి ఉంది.

పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కోస్ట్ గార్డ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా దూసుకెళ్లి పేలినట్లు సమాచారం. ఘటన అనంతరం ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.