సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి, గట్టుప్పల్, మునుగోడు మండలాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శుక్రవారం సీపీఐ కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, పేద కుటుంబాలకు వైద్య, ఇతర అత్యవసర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. మరింత మంది పేదలకు ఆర్థిక భరోసా కల్పించేలా సీఎంఆర్‌ఎఫ్ నిధులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తీరుపారి వెంకటేశ్వర్లు, బి. లాలు, సురిగి చలపతి, చాపల శ్రీను, బి. రమేష్, ఈధులకంటి కైలాష్, వనం వెంకన్న, కట్కూరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.