సమయం గడిచినా సిబ్బంది జాడలేదు..
కోటగిరి, ఆంధ్రప్రభ : కోటగిరి మండల ఎంపీడీవో కార్యాలయం శుక్రవారం ఉదయం 10:30 గంటలు దాటినా తెరుచుకోకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు అధికారుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యాలయంలో సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ విషయమై ఆంధ్రప్రభ ప్రతినిధి ఎంపీడీవోను ఫోన్ ద్వారా సంప్రదించగా, తాను హైదరాబాద్లో శిక్షణ (ట్రైనింగ్)లో ఉన్నట్లు తెలిపారు. అయితే కార్యాలయం ఎందుకు తెరుచుకోలేదనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. దీంతో కార్యాలయ నిర్వహణపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
