మంత్రి తుమ్మలను కలిసిన కాంగ్రెస్ నేతలు.. గ్రామ సమస్యలపై వినతి
దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామ సర్పంచ్ సిద్ధిన రాధాకుమారి గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావు గంగాధరరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మన్నెం అప్పారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కేవీ సత్యనారాయణ, ముష్టిబండ సర్పంచ్ సిద్ధిన రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.
