భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు.. వెంటనే స్పందించిన సర్పంచ్

వాంకిడి, ఆంధ్రప్రభ: మండలంలోని బంబార గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజి వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారు. సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి నీరు తొలగించే పనులను చేపట్టడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ జాడి సంతోష్‌తో కలిసి బాధితులకు అండగా నిలిచిన సర్పంచ్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.