ఆయిల్ ఫామ్ తోటలతో అధిక లాభాలు..
ఆయిల్ ఫామ్ తోటలతో అధిక లాభాలు..
సీఈఓ ఉదయ్ కుమార్..
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ఆయిల్ ఫామ్ తోటల వల్ల రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని మ్యాట్రిక్స్ కంపెనీ సీఈఓ ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ రైతుల ఆయిల్ ఫామ్ తోటలను బుధవారం మధ్యాహ్నం మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు సందర్శించారు.అనంతరం ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్రిక్స్ కంపెనీ సీఈఓ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు విధానాలను వివరించారు. యాజమాన్య పద్ధతులు, తక్కువ పెట్టుబడితో, దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాట్రిక్స్ కంపెనీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎంబడి కవిత,గ్రామ రైతులు గుర్రం గోపాల్ రెడ్డి,కల్లెం బాపురెడ్డి, కల్లెం తిరుపతి రెడ్డి, కల్లెం లచ్చిరెడ్డి,సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి,గుర్రం గంగారెడ్డి,కల్లెం ప్రవీణ్ రెడ్డి,తోట మదుకర్, తదితరులు పాల్గొన్నారు.
