కళాశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ

తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సర్వేలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ కేంద్రంలోని ఏకైక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదనపు గదులు నిర్మిస్తే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం.డి. అమీర్, మండల కార్యదర్శి బోడపూర్తి మహేష్, ఆకాష్, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.