యాదగిరిగుట్ట బోర్డులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం కు దక్కనిచోటు
యాదగిరిగుట్ట బోర్డులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం కు దక్కనిచోటు
నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి
వలిగొండ, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా ప్రకటించిన 15 మంది సభ్యుల బోర్డులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి స్థానం దక్కలేదు.
ఆలయం ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ, భువనగిరికి అత్యంత సమీపంలో ఉండడం, భువనగిరి నుంచే భక్తులు ఎక్కువగా వస్తుండడంతో భువనగిరి ఎమ్మెల్యేకు బోర్డులో చోటు ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశించాయి. కానీ పేరు లేకపోవడంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల స్పందన
యాదగిరిగుట్టకు భువనగిరి గేట్వే లాంటిది. అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలకు మా ఎమ్మెల్యే సహకారం అవసరం. బోర్డులో అవకాశం ఇస్తే బాగుండేది” అని ఓ సీనియర్ నేత అన్నారు.
