accident | లోయలో పడిన స్లీపర్ బస్సు
accident | లోయలో పడిన స్లీపర్ బస్సు
accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా పరిధిలోని ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న స్లీపర్ బస్సు ముందున్న కారును బలంగా ఢీకొనడంతో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, అనంతరం వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

