కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అనంతపురం, ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం 10.50 గంటలకు విశ్వవిద్యాలయ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.