వీధికుక్కల దాడితో 18 మేకలు మృతి..

చేవెళ్ల, ఆంధ్రప్రభ: చేవెళ్ల మున్సిపల్ పరిధిలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి చేవెళ్ల గ్రామానికి చెందిన రైతు కిష్టయ్యకు చెందిన మేకల మందపై కుక్కలు గుంపుగా దాడి చేసి 18 మేకలను చంపేశాయి. దాడి సమయంలో మందలో ఉన్న మరో 200 గొర్రెలు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీసి రైతు ఇంటికి చేరుకోవడంతో పెద్ద నష్టం తప్పింది.

సమాచారం అందుకున్న చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ సమత వెంకటరెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత రైతు కిష్టయ్యను పరామర్శించిన వారు, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.