Manuguru Protest | సేవ్ మణుగూరు బంద్ విజయవంతం..

Manuguru Protest | సేవ్ మణుగూరు బంద్ విజయవంతం..

Manuguru Protest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సేవ్ మణుగూరు పేరుతో మణుగూరు అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు మణుగూరు పట్టణ బంద్ విజయవంతం జరిగిందని ముందుగా మణుగూరు పట్టణంలో అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రదర్శన నిర్వహించి ఆనంతర0 అంబేద్కర్ సెంటర్లో జరిగిన సమావేశంలో దుర్గ్యాల సుధాకర్ (సిపిఐ) వాసిరెడ్డి చలపతిరావు (టిడిపి), రూపురెడ్డి మధుసూదన్ రెడ్డి సిపిఐ (ఎంఎల్ మాస్ లైన్) నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మణుగూరు పీకే ఓసి డిప్ సైడ్ బ్లాక్ ను ప్రైవేట్ పరం చేయకుండా సింగరేణికి కేటాయించాలని, మణుగూరు ఓసి ఎక్స్టెన్షన్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ‘అఖిలపక్ష పార్టీలు కార్మిక సంఘాలు ఇచ్చిన బందు విజయవంతం జరిగిందని, ఇప్పటికైనా సింగరేణి సంస్థ గుర్తించి ఓసి టు డిసైడ్ బ్లాక్ ను* _*సింగరేణి అప్పచెప్పాలని,డిమాండ్ చేశారు .1974 సంవత్సరంలో మణుగూరులో pk _1 ఇంక్లైన్ బొగ్గు బావి ప్రారంభించి నాటినుండి పీకే _2, పీకే _3, ఓ సి, ఓ సి _2, ఓసి _3 ఓ సి _4 లు విస్తరించి సింగరేణి సంస్థ అభివృద్ధికి బాటలు వేస్తూ అనేక వేల మందిసింగరేణి కార్మికులు తో మణుగూరు పట్టణం విరాజిల్లిందని, మణుగూరు సింగరేణి మీదనే ఆధారపడి పట్టణ అభివృద్ధి, వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇలా ఒకదానిమట ఒకటి అభివృద్ధి చెందుతూఉన్నాయి.

నేడు సింగరేణి మణుగూరులో కేవలం రెండు బావులే నడుస్తున్నాయని పీకే ఓసి డిప్ సైడ్ బ్లాక్ ను ప్రవేట్ పరం చేయకుండా సింగరేణికే అప్ప చెప్పాలని, మణుగూరు ఓసి అనుమతులు తీసుకురావాలని, అప్పుడే సింగరేణి కార్మికులు ప్రాంత అభివృద్ధి జరుగుతుందని డిప్ సైడ్ బ్లాక్ ను ప్రవేట్ పరం చేస్తే ఉన్నటువంటి కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే, ఈ ప్రాంత అభివృద్ధి ప్రశ్నార్ధకమవుతుందని ఈ ప్రాంతంలో సింగరేణికి ఇంకా 25 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, బోగ్గు అత్యధికంగా ఈ జిల్లాలో ఉండడం వలన రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు ప్రాంతంలో బి టి పి ఎస్ నిర్మాణం కూడా చేపట్టిందని కానీ సింగరేణి* *వారు ఉన్నవాటికి ఆనుమంతులు తీసుకురాలేక, ఉన్న బొగ్గు భావాలను ప్రైవేటుపరం చేయడానికి చూస్తుందని , దీనిని అడ్డుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వమన్నారు.

దీనిలో భాగంగా పికే ఓసి డిప్ సైడ్ బ్లాక్ ను ప్రవేట్ పరంకు ప్రయత్నం అని అందుకే కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ‘సేవ్ మణుగూరు’ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు సహకరించినచాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక,వ్యాపారస్తులు, బులియన్ మర్చంట్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్, జనరల్ స్టోర్ అసోసియేషన్, కిరాణా స్టోర్ అసోసియేషన్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్, ఫ్యాన్సీ జనరల్ స్టోర్ అసోసియేషన్, చికెన్ అండ్ మటన్ మార్కెట్ అసోసియేషన్, విద్యాసంస్థలు, హోటల్స్, పట్టణ పుర ప్రముఖులు అన్ని వర్గాల ప్రజలు సహకరించి బందు విజయవంతం* *చేశారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ పట్టణ బంద్ తో పాటు సంఘీభావంగా పి.వీ .కాలనీలో కూడా అన్ని షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, సిపిఐ మణుగూరు మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, సుజాత, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, తోట రమేష్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇమామ్ ఉద్దీన్ ,తేనేటి నారాయణ, ఎస్ డి, ఉమర్, కొత్తపల్లి సీతారాములు, బోశెట్టి సంపత్ ,ఎస్ కే సర్వర్, ఎస్వీ నాయుడు, ఆధర్ల రాములు చిక్కుల శివ, కన్నెబోయిన ప్రసాద్,
తెలుగుదేశం పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి మద్దెల భద్రయ్య, పట్టణ అధ్యక్షులు తాటి పూర్ణచంద్రరావు, రాజా, ఆంజనేయులు, జంపాల యాకయ్య సిపిఐ (ఎంఎల్ మాస్ లైన్ )మండల నాయకులు. తదితరులు పాల్గొన్నారు