Accident Nalgonda | ఇద్దరు డ్రైవర్లకు గాయాలు

Accident Nalgonda | ఇద్దరు డ్రైవర్లకు గాయాలు

టైరు పేలడంతో అదుపుతప్పిన బస్సు

Accident Nalgonda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

భీమవరం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కట్టంగూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.