ENE Repeat | థియేటర్లలో ‘ENE Repeat’ హంగామా.. ఎప్పుడంటే?

ENE Repeat | థియేటర్లలో ‘ENE Repeat’ హంగామా.. ఎప్పుడంటే?

ENE Repeat | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో విడుదలై యూత్‌ను మెప్పించిన సినిమా.. ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది అంటే సినిమా యువతను ఎంతలా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా సీక్వెల్ త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. ‘ENE Repeat’ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

ఫ్రెండ్‌షిప్, ఫన్, ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. ఈ ప్రచార వీడియోలో “ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కలుద్దాం.. మరోసారి కలిసి ఎంజాయ్ చేద్దాం” అనే సందేశాన్ని వినూత్నంగా చూపించారు. దీంతో తొలి భాగాన్ని అభిమానించిన ప్రేక్షకుల్లో సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది.

దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో తొలి భాగంలోని ప్రముఖ నటీనటులు మరోసారి సందడి చేయనున్నారు. తొలి చిత్రంలోని స్నేహితుల కథకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ అదే జోష్‌ను కొనసాగిస్తూ వస్తున్న ‘ENE Repeat’ మరో వినోదభరితమైన అనుభూతిని అందిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.