ఈ ఏడాది వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురియాలి

రైతు సోదరుల ఇంట ధాన్యరాశులు నిండాలి
నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్ష
యార్లగడ్డలో ఏరువాక పౌర్ణమి వేడుకలు

చల్లపల్లి, ఆంద్ర‌ప్ర‌భ : ఈ ఏడాది వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతు సోదరుల ఇంట ధాన్యరాశులు నిండాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్షించారు. సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు చల్లపల్లి మండలం యార్లగడ్డలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ విచ్చేసి జోడెడ్లకు పూజలు చేసి పొలం దున్ని, వరి విత్తనాలు చల్లి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాత – సుఖీభవ అంటూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న అండదండలతో రైతు సోదరులు ఆర్థికంగా బలోపేతం కావాలని, ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణగా వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు, మాజీ సర్పంచులు పరుచూరి సురేష్, బొబ్బా కృష్ణారావు, ఏఓ కే.మురళీకృష్ణ, రైతు పెద్దలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.