రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆచూకీ కోసం రైల్వే పోలీసుల విజ్ఞప్తి

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న రైలులోని జనరల్ కోచ్‌లో సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. రైలులో సదరు ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బీదర్ రైల్వే పోలీసులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 28 మధ్యాహ్నం ఆయన మరణించాడు.

మృతుడి కుడిచేతిపై “ఓం” టాటూతో పాటు “సత్యవతి” అనే పేరు, దాని కింద హనుమాన్ బొమ్మ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే ఎస్‌ఐ మహబూబ్ బాష (లేదా) బీదర్ రైల్వే పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.