జయగిరిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
జయగిరిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయగిరి గ్రామ శివార్లలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న స్థావరం పై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నగదు, మొబైల్ ఫోన్లు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎమహేందర్ తెలిపారు. ఈ దాడిలో కుమార్ (41), రాజ్ కుమార్ (31), సంపత్ (39), సుభాష్ గౌడ్ (51), రాజ్ కుమార్ (52)లను అరెష్టు చేశామని అన్నారు.
అలాగే స్థావరం నుండి 6వేల980 రూపాయల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఐదు వాహనాలు, రెండు బైక్‌లు స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి జూద క్రీడలపై కఠిన చర్యలు చేపట్టుతున్నట్లు సీఐ హెచ్చరించారు.
