టాస్ గెలిచిన భారత్..
- ఐర్లాండ్‌తో రెండో టీ20..
- సిరీస్ సమం చేయడమే లక్ష్యం
- శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి టీమిండియా
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు తొలి విజయోత్సాహంలో ఉన్న ఐర్లాండ్ వరుసగా రెండో విజయంతో సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
భారత్ జట్టు : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఐర్లాండ్ జట్టు : టిమ్ హీట్్లీ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కన్ టక్కర్ (కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, జై మూంద్రా, మ్యాట్ హోలార్డ్, మ్యాథ్యూ హంఫ్రీస్.
