ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించిన యువకుడికి ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఎలగడప గ్రామానికి చెందిన రామగిరి హర్షిత్ ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించడంతో గ్రామంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ నాయకత్వంలో కడెం మండల మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపురావు, గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షిత్‌కు పూలమాల వేసి, శాలువా కప్పి, స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా భూక్య అమ్మి బాపురావు మాట్లాడుతూ, కుటుంబానికి, గ్రామానికి, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన హర్షిత్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. యువత కూడా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశ సేవలో నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దీకొండ రాములు, మాజీ ఉపసర్పంచ్ రాపర్తి లక్ష్మణ్, వార్డు సభ్యురాలు తోడిశెట్టి లక్ష్మీరాజ్యం, తోడిశెట్టి బాలయ్య, వంగ వెంకటేష్ గౌడ్, డాక్టర్ సందు శ్రీనివాస్, రాపర్తి పెద్ద లక్ష్మణ్, దుర్గం రఘు, మైనార్టీ అధ్యక్షుడు సిరాజ్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.