10వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమం
భీమ్గల్, ఆంధ్రప్రభ: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమ్గల్ పట్టణంలోని 10వ వార్డులో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంటి లత, జేజే నర్సయ్య హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ సంటి లత మాట్లాడుతూ.. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఆరోగ్యవంతమైన, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ బెజ్జోరా భాస్కర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలియో చుక్కలు వేయించేందుకు స్థానిక తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా తరలివచ్చారు.
