3-Women-Dead : అయ్యో… అక్కడికక్కడే Andhra Prabha Crime News
3-Women-Dead : అయ్యో… అక్కడికక్కడే Andhra Prabha Crime News
- ముగ్గురు మహిళలు ఛిద్రం
- కవిటిలో ఘోర ప్రమాదం
- లారీ ఢీకొని ఆటో నుజ్జు
( కవిటి, ఆంధ్రప్రభభ ):

3-Women-Dead : శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని జమేదారుపుట్టుగ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం సంత నుంచి బరంపురం వైపు వెళ్తున్న ఆటోను అదే దారిలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.లారీ ఢీకొట్టిన తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులను ఇచ్చాపురం ఏఎస్‌పేట బోర్డర్‌కు చెందిన మద్దిలి తరినమ్మ (52), కవిటి మండలం గుజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన మురపాల పార్వతి (50), రాపాకపుట్టుగకు చెందిన నర్తు పద్మమ్మ (60)గా పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
