బాసరలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి పూజలు

బాసరలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి పూజలు

బాసర, ఆంధ్ర ప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి ఆదివారం ఉదయం చేరుకొన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ను ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చే ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వచన మండపంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శాలువాతో సత్కరించి అమ్మవారికి ఇక ప్రసాదాలు ఫోటోను అందజేశారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఆలయ ఈఓ ఆంజని దేవి,మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.