అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు

9వ డివిజన్‌లో ‘సర్‌’ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

ఆంధ్రప్రభ, పటమట : ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిచేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను ప్రభుత్వం నిర్వహిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్‌ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. అనంతరం డివిజన్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమం తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి ప్రభుత్వం ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ సర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అందువల్ల బి ఎల్ వోలు ఇంటికి వచ్చిన సమయంలో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆయన కోరారు. సర్‌ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలోని లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దేందుకు అవకాశం ఉందన్నారు. సరైన ఓటరు జాబితా ద్వారానే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం తెలుస్తోందని, అందువల్ల ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరి దిద్దేందుకు ప్రజలు బిఎల్ఓ లకు పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ,
పూర్ణచంద్రరావు,బాబాయ్,ప్రసన్న,కడియాల దుర్గభవాని, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.