నాపాక ఆలయంలో ట్రైనీ కలెక్టర్ ప్రత్యేక పూజలు

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నాపాక గ్రామంలో ఉన్న శ్రీనాపాక ఆలయాన్ని ట్రైనీ కలెక్టర్ (శిక్షణ డిప్యూటీ కలెక్టర్) నవీన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల ప్రభాకరాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను ట్రైనీ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ, నాపాక ఆలయ అభివృద్ధికి అవసరమైన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ, ఏపీఓ హలీం, ఈసీ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ యాదండ్ల రాజయ్య, రాయరాకుల రవి తదితరులు పాల్గొన్నారు.