నూతన ఎంపీడీవోను సన్మానించిన సర్పంచ్..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ నూతన ఎంపీడీవో గా పావని ఇటీవలపదవిబాధ్యతలు స్వీకరించడంతో బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య తో పాటు బిజెపి నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని గ్రామాల్లో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి మంజూరు చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో బాలాజీ, వార్డ్ సభ్యులు రాఘవేంద్ర, రాజు, బిజెపి నాయకులు ఆంజనేయులు గౌడ్, పత్తి ఆంజనేయులు, కే. వెంకటప్ప, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.