టేకుమట్లలో తండ్రి జ్ఞాపకార్థ విగ్రహావిష్కరణ..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : తండ్రి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను, సమాజానికి అందించిన ఆదర్శాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పలువురు ప్రముఖులు ముంజాల ఐలయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వం, సమాజానికి చేసిన సేవలను కొనియాడారు.

కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.