గ్రామ దేవతలకు జలాభిషేకం..
ఎల్కతుర్తి ,ఆంధ్రప్రభ : మండలం లోని సూరారం గ్రామంలో గ్రామ సర్పంచ్ భాషా బోయిన నీల కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు మహిళలు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలా కొమురయ్య మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడాలని గ్రామ ప్రజలు పాడిపంటలతో సంతోషంగా జీవించాలని వర్షాలు పడితే రైతులు సకలజీవులు సమస్త ప్రజలు ఆనందంగా జీవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి సంపత్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
