తాళ్లసింగారం, ధర్మాజీగూడెంలో ఉచిత వైద్య శిబిరాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం, ధర్మాజీగూడెం గ్రామాలలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ‘హెల్పేజ్ ఇండియా’, ‘హెచ్‌ఎస్‌బీసీ’ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత మందుల క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరాల్లో గ్రామ సమాఖ్య లీడర్స్, వృద్ధుల సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా హెల్పేజ్ ఇండియా ప్రాజెక్టు ఆఫీసర్ తురక షడ్రక్ మాట్లాడుతూ.. సంస్థ ద్వారా వృద్ధుల జీవనోపాధి, ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. వృద్ధులు మోకాళ్ల నొప్పులు, రక్తపోటు (బీపీ) వంటి ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇన్‌చార్జ్ పోచంపల్లి వి.వేణు, హెల్పేజ్ ఇండియా స్టేట్ హెడ్ యేతేంద్ర యాదవ్, మేనేజర్ మృణాల్ శ్రీకాంత్, గ్రామ వాలంటీర్లు దొనకొండ అనూష, బోయ సుజాత, లక్ష్మీ ప్రసన్నతో పాటు డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్లు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలు అందించినందుకు గ్రామ లీడర్స్, వృద్ధులు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
