పేదల ఆరోగ్య భద్రతకు భరోసా సీఎంఆర్ఎఫ్.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
గొల్లపూడిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ.
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో శుక్రవారం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సీఎంఆర్ఎఫ్ రీ ఎంబర్స్ మెంట్ చెక్కులను, ఎల్.ఓ.సీలను లబ్ధిదారులకు అందజేశారు. కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలం, విజయవాడ రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొండపల్లి మున్సిపాలిటీతో పాటు, ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి 15 మంది లబ్ధిదారులకు రూ.6,50,114లు, విజయవాడ రూరల్ మండలానికి 11 మంది లబ్ధిదారులకు రూ.10,95,799 లు మంజూరైనట్లు తెలిపారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకకున్నారు. సీఎం సందేశ పత్రాలను వారికి అందజేశారు. పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు పాల్గొన్నారు.
