Ram Charan | ఫ్యాన్స్ క్రేజీ డిస్కషన్స్!

Ram Charan | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌కు ఒక కొత్త గుర్తింపు రాబోతుందా? అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులంతా ఇదే విషయంపై ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు. భారీ విజయాలతో మంచి జోష్‌లో ఉన్న రామ్ చరణ్‌కు ఇప్పటికే ‘మెగా పవర్ స్టార్’ అనే ట్యాగ్ ఉంది. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఆయనకు సంబంధించి ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అనే కొత్త ట్యాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఈ ట్యాగ్ అధికారికంగా మారబోతుందా అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.

ఇటీవల వచ్చిన ‘పెద్ది’సినిమా ఘనవిజయంతో పాటు ఆ చిత్రంలో రామ్ చరణ్ కనబరిచిన నటనపై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసల కురిపిస్తున్నారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఆయన ఎంచుకుంటున్న వైవిధ్యమైన కథలు అభిమానులనే కాదు.. సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అనే ట్యాగ్ రామ్ చరణ్‌కు సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈ కొత్త ట్యాగ్‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అభిమానుల ప్రేమతో వచ్చిన ఈ ట్యాగ్ ఎంతో విలువైనదని చిరంజీవి అన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘పెద్ది’ సినిమా వరకు ‘మెగా పవర్ స్టార్’గా ఉన్న ఈ ట్యాగ్‌ను.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం ద్వారా అధికారికంగా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా టైటిల్ కార్డ్స్ లేదా ప్రమోషన్స్‌లో ఈ కొత్త ట్యాగ్‌ను అనౌన్స్ చేయనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.