తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు..

  • 13 మంది ఐఏఎస్, సీనియర్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు
  • సీఎం కార్యాలయం, కీలక శాఖల్లో విస్తృత మార్పులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు (జీఓ ఆర్.టి. నెం. 914) జారీ చేసింది. మొత్తం 13 మంది అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది.

ముఖ్యమైన బదిలీలు ఇవే..

  • ఎన్. శ్రీధర్ ను గనులు, భూగర్భశాఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
  • బి. అజిత్ రెడ్డిని సీఎం ప్రత్యేక కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించారు.
  • సబ్యసాచి ఘోష్ కు చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (FAC) బాధ్యతలు అప్పగించారు. అలాగే టీజీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టీజీకో మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
  • శైలజా రామయ్యర్ను ఎండోమెంట్స్ శాఖ నుంచి బదిలీ చేసి పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక (EFS&T) శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
  • అహ్మద్ నదీమ్ను పొలిటికల్ (GAD) శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ, మైనార్టీ సంక్షేమ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • సెలవు ముగించుకుని తిరిగొచ్చిన రాహుల్ బొజ్జాను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బీసీ సంక్షేమ శాఖకు అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.
  • ఎం. రఘునందన్ రావుకు గనులు, భూగర్భశాఖ కార్యదర్శి (FAC) బాధ్యతలు అప్పగించారు.
  • ముషర్రఫ్ అలీ ఫరూఖీ (టీజీఆర్‌పీడీసీఎల్ సీఎండీ)కి టీజీ రెడ్‌కో (TGREDCO) వైస్ చైర్మన్ & ఎండీ అదనపు బాధ్యతలు ఇచ్చారు.
  • పి. కాత్యాయిని దేవిని రాష్ట్ర ఆర్థిక సంస్థ జాయింట్ ఎండీ పదవి నుంచి బదిలీ చేసి చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
  • కె. గంగాధర్ను టీజీరెరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
  • టి. వెంకన్నను హెచ్‌ఎండీఏ నుంచి బదిలీ చేసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా నియమించారు.
  • కె. విద్యాసాగర్ను పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమిస్తూ, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి (FAC) బాధ్యతలు అప్పగించారు.
  • కె. చంద్రకళకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (FAC) అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.