Telangana | ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అత్యున్నత పరిపాలనా అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
సంజయ్ జాజు సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి. వివిధ కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాగా, త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
