పీర్ల ఉత్సవాలు నేడు ముగింపు..
- భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : గత పది రోజులుగా నిర్వహించిన పీర్ల ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.శుక్రవారం మండల కేంద్రంతో పాటు జయపురం,కొమ్ములవంచ, పడమటిగూడెం గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు కొనసాగుతున్నాయి.వాడ వాడల ఊరేగీస్తుండడంతో భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు.ఈ వేడుకల్లో ముస్లింలతో పాటు హిందువులు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మత సమస్యకి ప్రత్యేకంగా నిలుస్తున్నారు శోభాయాత్రగా నిర్వహించి సాయంత్రం చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సింహులపేట ఎస్ఐ వెంకన్న ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
