త్యాగానికి, ధర్మానికి ప్రతీక మొహరం : ఎమ్మెల్యే రాము
గుడివాడ, ఆంధ్రప్రభ : త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచే మొహరం పర్వదినం సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, “మొహరం అనేది క్రమశిక్షణ, త్యాగం, ధర్మం కోసం పోరాటాన్ని గుర్తు చేసే పవిత్రమైన పండుగ అన్నారు. హజరత్ ఇమామ్ హుస్సేన్ చూపిన త్యాగనిరతి నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. అందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో మొహరం వేడుకలు జరుపుకోవాలి” అని కోరారు.
“మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, పేదలకు సాయం చేస్తూ పండుగను జరుపుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
