ఉరవకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : కర్ణాటక రాష్ట్రం నుండి నెల్లూరు కు గ్రైనేట్ లోడుతో వెళుతున్న లారీ ఉరవకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని బూదగవి గ్రామ సమీపంలో ఉన్న 42 జాతీయ రహదారి లో శుక్రవారం తెల్లవారుజా మున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రైనేట్ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది.

లారీ క్యాబిన్ లో డీజల్ ట్యాంక్ పగిలిపోవడంతో, ఒక్కసారిగా లారీలో మంటలు వ్యాపించడంతో, లారీ డ్రైవర్ ఓబుల్ రెడ్డి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాల ను సేకరించారు. మృతుడు కడప జిల్లా పులివెందల సమీపంలో ఉన్న కనుమ పల్లిగా గుర్తించారు. లారీ క్లీనర్ పుల్లయ్య కు గాయాలయ్యాయి. అగ్ని మాపక వాహనాన్ని రప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది.
