Gold Smuggling | ఎయిర్‌పోర్టులో రూ.3.36 కోట్ల బంగారం స్వాధీనం
Gold Smuggling | ఎయిర్‌పోర్టులో రూ.3.36 కోట్ల బంగారం స్వాధీనం
Gold Smuggling | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి భారీ బంగారం స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అత్యంత తెలివిగా బంగారాన్ని దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేశారు.
విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, వారు తమ ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేక పౌచ్‌లను అమర్చుకుని, వాటిలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచినట్లు గుర్తించారు.
వారి వద్ద నుంచి 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.3.36 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ బంగారం ఎవరికి చేరాల్సి ఉంది? దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
