పేదలకు అభయ ఫౌండేషన్ అండ

వరంగల్ (ఆంధ్రప్రభ): అభయ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించారు. ట్రస్ట్ చైర్మన్ అంబు కీర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓ మహిళకు కుట్టు మిషన్ అందజేయడంతో పాటు ఓ విద్యార్థినికి కళాశాల ఫీజు చెల్లించారు.

గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్‌కు చెందిన ఎండి రేష్మకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ముందుగా కుట్టు శిక్షణ అందించి, అనంతరం కుట్టు మిషన్‌ను అందజేశారు.

అలాగే నర్సంపేట మండలం ఏనుగుల తండాకు చెందిన బోడ కిషన్ నాయక్ కుమార్తె హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితిలో అభయ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంబు కీర్తిని ఆశ్రయించగా, ఆయన వెంటనే స్పందించి కళాశాల ఫీజును చెల్లించినట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ వంతు సహాయం అందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అభయ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.