China Investment India | భారత్‌లో విదేశీ పెట్టుబడులకు కొత్త ఊతం
China Investment India | భారత్‌లో విదేశీ పెట్టుబడులకు కొత్త ఊతం
China Investment India | హార్స్ పవర్‌ట్రెయిన్ నుంచి 370 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదన
భారత్‌లో హైబ్రిడ్ ఇంజిన్ తయారీకి భారీ ప్రణాళిక
సరిహద్దు దేశాల పెట్టుబడులపై కేంద్రం సడలించిన నిబంధనలు
రెనాల్ట్–గీలీ భాగస్వామ్యంతో కొత్త తయారీ అవకాశాలు
China Investment India | న్యూఢిల్లీ: చైనా నుంచి దశాబ్దం కాలం తరువాత తొలిసారి భారీ పెట్టుబడి ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలపనుంది. చైనాకు చెందిన జెజియాంగ్ గీలీ హోల్డింగ్ గ్రూప్ కంపెనీ మద్దతు ఉన్న హైబ్రిడ్ ఇంజిన్ సంస్థ హార్స్ పవర్‌ట్రెయిన్ లిమిటెడ్ నుంచి 370 మిలియన్ డాలర్ల పెట్టుబడికి భారత్ ఆమోదం తెలపనుంది. ఇది ఇటీవల కాలంలో చైనాకు చెందిన ఒక అనుబంధ సంస్థ నుంచి వస్తున్న అతిపెద్ద తయారీ రంగ పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ ఒప్పందం ద్వారా హార్స్ పవర్‌ట్రెయిన్ సంస్థ భారత్‌లోని ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఉత్పాదక కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థలో మరో ప్రధాన వాటాదారు రెనాల్ట్ ఎస్‌ఏ. హార్స్ దేశంలో అధునాతన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్లు, ఇంజిన్లను నిర్మించాలని భావిస్తోంది. స్థానిక తయారీ రంగానికి మద్దతుగా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల కోసం భారత్ మార్చిలో నిబంధనలు సడలించింది. దీని తరువాత వస్తున్న అతిపెద్ద పెట్టుబడి ప్రతిపాదన ఇదే.
గతంలో కేంద్ర ప్రభుత్వం చైనాను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న షరతును తీసుకొచ్చింది. 2017లో చివరిసారిగా చైనాకు చెందిన ఒక ఆటోమొబైల్ సంస్థ భారత్‌లో పెట్టుబడి పెట్టింది. అప్పట్లో చైనా ప్రభుత్వ ఆధీనంలోని సైక్ (SAIC) మోటార్ కార్పొరేషన్ దేశంలో ఎంజీ మోటార్ బ్రాండ్‌ను ప్రారంభించేందుకు జనరల్ మోటార్స్ కంపెనీ ప్లాంట్‌ను కొనుగోలు చేసింది. ఈ తరువాత ఈ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుతం ఈ కంపెనీలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మెజారిటీ వాటా కలిగి ఉంది.
2024లో గీలీ, రెనాల్ట్ మధ్య సమాన వాటాల ఒప్పందంతో హార్స్ పవర్‌ట్రెయిన్ ఏర్పడింది. తరువాత సౌదీ ఆరామ్‌కో ఈ కంపెనీలో 10 శాతం వాటా తీసుకుంది. లండన్ ప్రధాన కార్యాలయం కలిగిన ఈ కంపెనీలో ప్రస్తుతం గీలీ, రెనాల్ట్ చెరో 45 శాతం వాటా కలిగి ఉన్నాయి. దీనికి ప్రపంచవ్యాప్తంగా 18 ప్లాంట్లు, 19 వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు.
చెన్నైలోని రెనాల్ట్ ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టనున్న హార్స్ సంస్థ, భారత్‌లో విక్రయించే నిస్సాన్, రెనాల్ట్ వాహనాల కోసం స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్లను తయారు చేయనుంది. జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీలో రెనాల్ట్ అతిపెద్ద వాటాదారుగా ఉంది.
